సినీ నటి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 13, 2018, 03:27 PM
 

సినీ నటి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో పెను కలకలం రేపుతున్నాయి. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ దారుణంగా ఉందని పేర్కొంది. తెలుగు అమ్మాయిలు దానికి అంగీకరించడం లేదనే అవకాశాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. కొంత మంది మెయింటెనెన్స్ కోసం కాస్టింగ్ కౌచ్ బాధితులుగా మారుతున్నారని బాధపడింది. ఇంతా చేసి అన్నింటికీ ఒప్పుకున్నా ప్రధానమైన పాత్రలు రావని, ఏదో ఒక పాత్ర చెయ్యమంటారని తెలిపింది.


తెలుగు సినిమాలు 100 బయటకు వస్తే 2 కూడా హిట్ కావడం లేదని, ఒక్క దానిలో కూడా నేటివిటీ ఉండదని తెలిపింది. ఇప్పుడు ఇండస్ట్రీలో సక్సెస్ చూస్తున్నవారు, వెనక నాన్నల పేర్లు తగిలించుకున్న వారందరికీ ముంబై, బెంగళూరు, చెన్నై, అమ్మాయిలు కావాలని చెప్పింది. తెలుగమ్మాయిలు ఏం తప్పు చేశారు? వాళ్లు ఫిజిక్ మెయిన్‌ టైన్ చెయ్యడం లేదా? ఎక్స్‌పోజ్ చెయ్యట్లేదా? హాట్‌ గా లేరా? కోరికలు తీర్చడం లేదా? అని నిలదీసింది.


తెలుగమ్మాయిలైతే పడుకునేందుకు కాంప్రమైజ్ కారని తెలిపింది. తీరా దానికి కూడా సిద్ధమంటే చిన్న క్యారెక్టర్ ఇస్తారని పేర్కొంది. తాను మీడియాలో పని చేయడం వల్ల ధైర్యంగా చెబుతున్నానని తెలిపింది. చాక్లెట్ వీడియోలవీ ఎందుకు చేస్తున్నాను? సిగ్గులేక కాదు కదా? అవకాశాల కోసం ఆ వీడియోలు చేయాల్సి వస్తోందని తెలిపింది. Recent Post