జిమ్ లో కష్టపడుతున్న జూనియర్ ఎన్టీఆర్

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 13, 2018, 04:59 PM
 

త్రివిక్రమ్-జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్ లో ప్రారంభం కానుంది. జూనియర్ ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే, ఈ చిత్రంలో మరింత ఫిట్ నెస్ తో జూనియర్ ఎన్టీఆర్ కనపడనున్నాడు. ఈ నేపథ్యంలో ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ సూచనలతో యంగ్ టైగర్ కసరత్తు ప్రారంభించాడు. ఇందుకు సంబంధించి జిమ్ లో కష్టపడుతున్న తారక్ ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాలకు చేరింది. 


 


 


 
Recent Post