ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభాస్‌ను దాటేసిన విజయ్ దేవరకొండ

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 14, 2018, 10:11 AM



హైదరాబాద్ టైమ్స్ ప్రకటించిన మోస్ట్ డిజైరబుల్ మెన్ ఆఫ్ 2017 ర్యాంకుల జాబితాలో అర్జున్‌రెడ్డి ఫేం విజయ్ దేవరకొండదూసుకెళ్లాడు. విజయ్ తర్వాత స్థానంలో ప్రభాస్ ఉండటం గమనార్హం. అయితే ఇండియన్ ఫిట్‌నెస్ మోడల్, టెలివిజన్ నటుడు బాసీర్ ఆలీ అగ్రస్థానంలో నిలిచి ఈ ఇద్దరి హీరోలకు షాకివ్వడం ఈ జాబితాలో చెప్పుకోదగిన అంశంగా నిలిచింది.సినీ హీరోలకు సంబంధించిన వరకు విజయ్ దేవరకొండ మొదటిస్థానంలో నిలిచాడు. పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి చిత్రాల్లో కేర్‌ఫ్రీ యాటిట్యూడ్‌తో దుమ్మురేపిన విజయ్ మంచి ర్యాంకును సొంతం చేసుకొన్నాడు. గతేడాది విజయ్ ర్యాంకు 20.బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించిన ప్రభాస్ రెండోస్థానంలో నిలిచాడు. గతేడాది ప్రభాస్‌ ర్యాంక్ 6. ప్రస్తుతం సాహో షూటింగ్‌లో ప్రభాస్ బిజీగా ఉన్నారు.ఇక మహేష్ నాలుగోస్థానంలో నిలిచాడు. 2016లో ఆయన ర్యాంక్ 2 గతేడాది వరుస ఫ్లాపుల కారణంగా ఆయన క్రేజ్‌ మసకబారిందనే అభిప్రాయం వ్యక్తమైనట్టు కనిపిస్తున్నది.మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ 5వ స్థానంలో నిలిచాడు. నిర్మాతగా, వ్యాపారవేత్తగా మారిన చెర్రీ తన లభించిన క్రేజ్‌తో పైకి ఎగబాకాడు. చెర్రీ నటించిన రంగస్థలం చిత్రంలో మార్చి 30న రిలీజ్ కానున్నది. గతేడాది చెర్రీ ర్యాంక్ 14.గతేడాది డీజేతో దుమ్మురేపిన అల్లు అర్జున్ తన స్థానాన్ని మెరుగుపరుచుకొన్నాడు. గతేడాది ఆయనకు 8 ర్యాంక్ లభించింది. ప్రస్తుతం ఆయన ర్యాంకు 6. బన్నీ నటించిన నా పేరు సూర్య చిత్రం ఏప్రిల్ మొదటివారంలో రిలీజ్ కానున్నది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com