యంగ్ హీరో నిఖిల్ తాజాగా నటించిన మూవీ కిరాక్ పార్టీ.. కన్నడ హిట్ చిత్రం కిరిక్ పార్టీకి ఇది రీమేక్ కాగా, ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బేనర్ పై ఈ మూవీ రూపొందింది. యువ దర్శకులు సుధీర్ వర్మ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు . మరో యువ దర్శకుడు చందూ మొండేటి సంభాషణలు సమకూర్చారు. రణ్ కొప్పిశెట్టి దర్శకుడు. ఈ మూవీ ఈ నెల 16వ తేదిన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. కళాశాలలో రాజకీయాల నేపథ్యంలో సాగే ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రంలో నిఖిల్ జూనియర్ స్టూడెంట్స్‌కి లీడర్‌గా ట్రైలర్ లో చూపారు..సంయుక్తా హెగ్డే, సిమ్రన్ పరీంజా కథానాయికలు. అంజనీష్ లోక్‌నాథ్ చిత్రానికి సంగీతం అందించాడు. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ను మీరూ చూడండి..