మూగ పాత్ర‌లో యంగ్ హీరో..

  Written by : Suryaa Desk Updated: Wed, Mar 14, 2018, 12:35 PM
 

ఈ మ‌ధ్య కాలంలో మ‌న హీరోలు కొత్త కొత్త ప్ర‌యోగాలు చేస్తున్నారు. లోపం ఉన్న పాత్ర‌లని ఎంచుకంటూ ప్రేక్ష‌కుల‌కి ప‌సందైన విందు అందిస్తున్నారు. ఆ మ‌ధ్య రాజ్ త‌రుణ్ అంధుడిగా న‌టించి అల‌రిస్తే, రీసెంట్‌గా ర‌వితేజ కూడా గుడ్డివాడి పాత్ర‌లో న‌టించి ఆనందింప‌జేశాడు. ఇక రంగ‌స్థ‌లం చిత్రంలో రామ్‌చ‌ర‌ణ్ వినికిడి స‌మస్య ఉన్న వ్య‌క్తిగా న‌టించాడు. మార్చి 30న విడుద‌ల కానున్న ఈ సినిమాపై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. గ‌త ఏడాది వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో విభిన్న చిత్రాలు చేసిన నారా రోహిత్ త‌న త‌దుపరి చిత్రంలో మూగ వ్య‌క్తిగా క‌నిపించి సంద‌డి చేయ‌నున్నాడు. నారా రోహిత్‌ 18వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వైష్ణవీ క్రియేషన్స్ బ్యానర్‌ పై నారాయణరావు అట్లూరి నిర్మిస్తున్నారు. వంశీ రాజేష్ కథా మాటలు అందిస్తుండగా పీబీ మంజునాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఉగాది రోజున ప్రారంభం కానుంది. వికాస్ కురుమెల్లా చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నారా రోహిత్ ప్ర‌స్తుతం వెంక‌టేష్‌- తేజ చిత్రంతో పాటు శ్రీ విష్ణు అప్‌కమింగ్ మూవీ నీది నాది ఒకే క‌థ చిత్రంతో బిజీగా ఉన్నాడు
Recent Post