రేపే రామ్ చ‌ర‌ణ్ ‘రంగ‌స్థ‌లం’ ఆడియో రిలీజ్

  Written by : Suryaa Desk Updated: Wed, Mar 14, 2018, 03:30 PM
 

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్, స‌మంత జంట‌గా న‌టించిన మూవీ రంగ‌స్థ‌లం.. ఈ మూవీ ఈ నెల 30వ తేదిన విడుద‌ల కానుంది.. ఈ నేప‌థ్యంలో ఈ మూవీలోని సాంగ్స్ ను జ్యూక్ బాక్స్ రూపంలో రేపు ఉద‌యం 10 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్నారు.. ఇప్ప‌టికే ఈ మూవీలోని మూడు సాంగ్స్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.. ఈ మూడు సాంగ్స్ టాప్ లో ఉన్నాయి.. మ‌రో రెండు సాంగ్స్ ను క‌లిపి మొత్తం అయిదు పాట‌లు రేపు రీలీజ్ అవుతున్నాయి..రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.. గ్రామీణ నేప‌థ్యంతో ఈ సినిమాలో అనసూయ, జగపతిబాబు, ఆది పినిసెట్టి త‌దిత‌రులు న‌టిస్తున్నారు..మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించిన ఈ చిత్ర ప్రి రీలీజ్ వేడుక విశాఖ‌లోఉగాది రోజైన ఈ నెల 18వ తేదిన జ‌ర‌గ‌నుంది.. ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజ‌రుకానున్నారు.
Recent Post