'యమలీల'లో నా పాత్ర అసంపూర్తిగా అనిపించింది

  Written by : Suryaa Desk Updated: Wed, Mar 14, 2018, 04:42 PM
 

తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఇంద్రజ పాల్గొన్నారు. ఆమెతో ఆలీ మాట్లాడుతూ " 'యమలీల ' సినిమా క్లైమాక్స్ లో నువ్ లేవని కొంచెం ఫీలైనట్టు తెలిసింది .. నిజమేనా ?' అని అడిగాడు . అందుకామె స్పందిస్తూ .. అవునూ .. చాలా డిజప్పాయింట్ అయ్యాను .. ఏడ్చాను" అన్నారు.


"ఈ సినిమాలో మీ అమ్మని మీరు ఇంట్లో నుంచి పంపించేయండి అంటూ నేను భర్తతో గొడవపడతాను. దాంతో నా భర్త నాపై చేయి చేసుకుంటాడు .. తన తల్లితోనే ఉంటానని చెప్పి నన్నే వెళ్లిపొమ్మంటాడు. అమ్మ విలువేంటో తెలియాలంటే నీకు బిడ్డ పుట్టాక ఆ బిడ్డనడుగు అంటాడు. ఆ సీన్ తరువాత నేను ఎక్కడా కనిపించను. నా పాత్ర మనసు మార్చుకుని మళ్లీ తిరిగి వచ్చేసినట్టుగా చూపిస్తే బాగుండేది. ఆ పాత్రకి సరైన ముగింపు లేకుండా వదిలేయడం చాలా బాధ కలిగించింది" అని అన్నారు.     


 


 
Recent Post