రంగస్థలం యూనిట్ మొత్తం ఆడియోతో వచ్చేస్తున్నారు

  Written by : Suryaa Desk Updated: Wed, Mar 14, 2018, 06:04 PM
 
 రంగస్థలం యూనిట్  ప్రేక్షకులకి సినిమా మీద  రోజురోజుకి హైప్ ని పెంచుతున్నారు. ఒక్కక్కటిగా సాంగ్స్ ని సోషల్ మీడియా లో రిలీజ్ చేస్తున్నారు .  ముఖ్యంగా ఇందులోని ‘ఎంత సక్కగున్నావే’ పాట సంగీత ప్రియుల్ని విశేషలంగా అలరించింది. అందులో సాహిత్యం కట్టిపడేసింది. ఆ ట్యూన్.. ఆ గానం కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ సాంగ్.. ‘రంగమ్మా మంగమ్మా’ పాటలు కూడా అలరించాయి. ఇప్పుడు ఈ చిత్ర ఫుల్ ఆడియో జనాల్లోకి వచ్చేయబోతోంది. గురువారం ఉదయం 10 గంటలకు ‘రంగస్థలం’ జ్యూక్ బాక్స్ ను సోషల్ మీడియాలో లాంచ్ చేయబోతున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ ప్రకటించింది.

గత కొన్ని సినిమాల ఆడియోల విషయంలో విమర్శలు ఎదుర్కొన్న దేవిశ్రీ ప్రసాద్.. ‘రంగస్థలం’తో మంచి ఆల్బం హిట్ కొట్టాలని చూస్తున్నాడు . మామూలుగానే సుకుమార్ సినిమా అంటే దేవి ప్రత్యేక శ్రద్ధ పెడతాడు. ఇప్పుడు తనేంటో మళ్లీ రుజువుచేసుకోవాల్సిన స్థితిలో ‘రంగస్థలం’పై మరింతగా ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే మూడు పాటలతో ఆకట్టుకున్న దేవి.. పూర్తి ఆడియోతో ఎంత మెప్పిస్తాడో చూడాలి. ఈ చిత్రంలో ఐదు ఫుల్ సాంగ్స్ తో పాటు.. ఒక బిట్ సాంగ్ కూడా ఉంటుందని అంటున్నారు. ఆడియో విడుదలైన వారం రోజులకు ‘రంగస్థలం’ ప్రి రిలీజ్ ఈవెంట్ విశాఖపట్నంలో భారీ ఎత్తున చేయబోతున్నారు. ఈ నెల 30న ‘రంగస్థలం’ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.Recent Post