ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్టార్ హీరోయిన్ ఫాలో అవుతున్న రాశి ఖన్నా !

cinema |  Suryaa Desk  | Published : Fri, Jun 11, 2021, 11:16 AM



తెలుగు ఇండస్ట్రీలో వరస సినిమాలు చేస్తూ తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకుంది రాశీ ఖన్నా. సినిమా ఇండస్ట్రీలో ఏ జోనర్ లో అయితే భారీ హిట్ వస్తోందో.. ఇక మిగిలిన వాళ్ళంతా ఆ జోనర్ మీదే పడతారు. ప్రస్తుతం ఓటీటీ హవా నడుస్తోంది. ఈ క్రమంలో భారీ అంచనాలతో వచ్చిన ‘ది ఫ్యామిలీ మేన్ 2’ వెబ్ సిరీస్ బాగా క్లిక్ అయి సూపర్ హిట్ అయింది. దాంతో సినిమా వాళ్ళ చూపులు అన్నీ ఇప్పుడు ఓటీటీల వైపు వెబ్ సిరీస్ ల వైపు పడింది.సీనియర్ హీరోలు చాలామందికి థియేటర్ బిజినెస్ లేదు. వాళ్లకు ఓటీటీలోనే భవిష్యత్తు కనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగానే ఓటీటీలో కూడా బాగానే డబ్బులు వస్తున్నాయి. అందుకే, స్టార్ హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్ ల్లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పైగా ‘ఫ్యామిలీ మెన్’ సిరీస్ లో రాజీ అనే పాత్రలో సమంత అదరగొట్టడం, అదే విధంగా ఈ పాత్ర పై తమిళ సమాజం విరుచుకుపడటం, మొత్తానికి ఈ సిరీస్ కి ఫ్రీ పబ్లిసిటీ దక్కి నాలుగు వ్యూస్ ఎక్కువ వచ్చాయి.మొత్తానికి రాశి ఖన్నా కూడా సమంతను ఫాలో అవుతూ వెబ్ సిరీస్ లతో బిజీ అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com