పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో రాశి ఖన్నా ?

  Written by : Suryaa Desk Updated: Fri, Jun 11, 2021, 12:07 PM

ప్రస్తుతం ప్రభాస్ .. 'సలార్' సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత ఆయన 'ఆది పురుష్' ప్రాజెక్టు పైకి రానున్నాడు. ఆ వెంటనే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఇది సైన్స్ ఫిక్షన్ మూవీ .. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా నిర్మితం కానుంది. కీలకమైన పాత్రల కోసం వివిధ భాషల నుంచి నటీనటులను ఎంపిక చేస్తున్నారు.టాలీవుడ్ నటి గ్లామర్ బ్యూటీ రాశి ఖన్నా పరిచయం గురించి అందరికీ తెలిసిందే.అతి తక్కువ సమయంలో టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంది.ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమాలలో బిజీగా ఉండగా తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాలో అవకాశం అందుకుందట.ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈయన సినిమాలలో చాలా వరకు బాలీవుడ్ హీరోయిన్ లే ఎక్కువగా నటిస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా రాశి ఖన్నా కూడా ఓ పాత్రలో మెరవనుందట.ప్రస్తుతం ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వం లో ఓ సినిమా చేయనున్నాడు.అందులో బాలీవుడ్ స్టార్ నటి దీపిక పదుకొనే హీరోయిన్ గా నటించనుంది.అంతే కాకుండా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించనున్నాడు.
Recent Post