అర్థ శతాబ్దం తెలుగు మూవీ రివ్యూ

  Written by : Suryaa Desk Updated: Fri, Jun 11, 2021, 12:38 PM

లాక్ డౌన్ నేపథ్యంలో ఓటీటీ విడుదలకు సిద్ధమైన మరో కొత్త చిత్రం ‘అర్ధశతాబ్దం’. ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ కార్తీక్ రత్నం ప్రధాన పాత్రలో కొత్త దర్శకుడు ప్రవీణ్ పుల్లె రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ‘ఆహా’ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో కార్తీక్ రత్నం‌, నవీన్ చంద్ర, కృష్ణ ప్రియ కీలక పాత్రల్లో వస్తున్న సినిమా ‘అర్ధ శతాబ్దం’. ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా.


 


అది సిరిసిల్ల‌. అక్క‌డి ప్ర‌జ‌లు రెండు వ‌ర్గాలుగా విడిపోయి ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారు. ఒక‌రిపై ఒక‌రు ఆధిప‌త్యం చ‌లాయించుకోవాల‌ని చూస్తుంటారు. ఆ ఊరివాడే కృష్ణ (కార్తీక్ ర‌త్నం). దుబాయ్ వెళ్లి, బాగా సంపాదించి.. అమ్మాచ చెల్లెల్ని బాగా చూసుకోవాల‌న్న‌ది కోరిక‌. చిన్న‌ప్ప‌టి నుంచీ పుష్ష (కృష్ణ ప్రియ‌) అంటే చాలా ఇష్టం. త‌న వెన‌కే తిరుగుతుంటాడు. కానీ.. పుష్ష త‌న‌ని ప‌ట్టించుకోదు. ఊర్లో బాబాయ్ (గౌత‌మ్ రాజు) కొట్టు ద‌గ్గ‌ర‌.. ఓ పూల మొక్క ఉంటుంది. ఆ మొక్క‌కి పూచిన పువ్వంటే పుష్ష‌కి ఇష్టం. అందుకోసం రోజూ.. ఆ మొక్క ద‌గ్గ‌ర‌కు వ‌స్తుంటుంది. ఆ మొక్క‌కి పూచిన పువ్వు కోసి.. అది పుష్ష చేతిలో పెట్టి, త‌న మ‌న‌సులోని మాట బ‌య‌ట‌పెట్టాల‌న్న‌ది కృష్ణ ఆలోచ‌న‌. అయితే ఈలోగా.. ఆ పువ్వు ఎవ‌రో కోసుకెళ్లిపోతారు. అదంతా.. ప్ర‌త్య‌ర్థి వ‌ర్గం ప‌నే అనుకుని… కృష్ణ‌, అత‌ని స్నేహితులు ప్ర‌త్య‌ర్థిపై దాడి చేస్తారు. అది కాస్త కులాల మ‌ధ్య కుమ్ములాట గా మారిపోతుంది. ఊర్లో ఒక‌రికొక‌రు న‌రుక్కునే వ‌ర‌కూ వెళ్తుంది. ఊరంతా ర‌క్త‌పాత‌మ‌యం. మ‌రి… ఈ అరాచ‌కం ఎలా ఆగింది? వ‌ర్గాల మ‌ధ్య పోరాటం ఎంత వ‌ర‌కూ వెళ్లింది? అనేది మిగిలిన క‌థ‌.కార్తీక్ ర‌త్నం ఏ ఫ్రేములోనూ హీరోగా క‌నిపించ‌డు. కృష్ణ‌లానే బిహేవ్ చేశాడు. త‌న న‌ట‌న స‌హ‌జంగా ఉన్నా.. ఆ పాత్ర‌ని బ‌లంగా తీర్చిదిద్ద‌లేదు ద‌ర్శ‌కుడు. ప‌ల్లెటూరి అమ్మాయిగా కృష్ణ‌ప్రియ ప‌ద్ధ‌తిగా, సంప్ర‌దాయంగా ఉంది. న‌వీన్ చంద్ర పాత్ర‌ని స‌గం స‌గం ఉడికించి, పొయ్యిమీద నుంచి దింపేశాడు ద‌ర్శ‌కుడు. దాంతో ఆ పాత్ర ఫ‌స్ట్రేష‌న్ ఏమిటో ప్రేక్ష‌కుడికి పూర్తిగా అర్థం కాదు. సాయికుమార్ కి న‌క్స‌లైట్ నేప‌థ్యం ఉంద‌ని చూపించి, దాన్ని కేవ‌లం ఒక్క సీన్ కే ప‌రిమితం చేశారు. పాట‌లు బాగున్నాయి. అర్థవంతంగా అనిపించాయి. ఈ సినిమాలో, సాంకేతిక నిపుణుల్లో ఎక్కువ మార్కులు సంగీతానికీ, సంగీత ద‌ర్శ‌కుడికీ ప‌డ‌తాయి. ఏ క‌న్నులూ చూడ‌ని చిత్ర‌మే.. పాట హృద్యంగా సాగింది. శంక‌ర్ మ‌హ‌దేవ‌న్ పాడిన పాట కూడా న‌చ్చుతుంది. ద‌ర్శ‌కుడికంటూ ఓ భావ‌జాలం ఉంద‌ని అర్థ‌మైంది కానీ, అదేంటో ప్రేక్ష‌కుడికి అర్థం కాదు. అదే.. ఈ సినిమాలోని లోపం.


 


 అర్ధశతాబ్దం.. వ్యర్థ ప్రయత్నం


 


రేటింగ్-2/5


 
Recent Post