ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ అంటే ఇష్టం , కానీ నో మలయాళం భామ ?

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 12, 2021, 03:39 PM



పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరసగా సినిమాలకు కమిటైన విషయం తెల్సిందే. వకీల్ సాబ్ తర్వాత హరిహర వీర మల్లు, అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్ర రీమేక్స్ తో పవన్ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే ఈ రెండు చిత్రాలు పూర్తైన తర్వాత హరీష్ శంకర్ చిత్రంలో పవన్ కళ్యాణ్ నటించాల్సి ఉంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రంపై బోలెడంత బజ్ ఉంది.అయితే ఈ చిత్రం స్టార్టింగ్ లోనే ఓ టాక్ మరో స్థాయిలో వైరల్ అయ్యింది.ఈ చిత్రంలో పవన్ సరసన యంగ్ అండ్ బ్యూటిఫుల్ మళయాళ నటి మానస రాధాకృష్ణన్ నటిస్తుంది అన్న టాక్ ఓ రేంజ్ లో వైరల్ కాగా అపుడు కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే ఇపుడు ఈ విషయం పైనే తాను స్పందిస్తూ మానస క్లారిటీ ఇచ్చింది. “తాను పవన్ చేస్తున్న 28వ సినిమాలో లేనని తెలియజేస్తున్నాని, కానీ నాకు పవన్ సర్ అంటే ఇష్టం అని” క్లారిటీ ఇచ్చింది. దీనితో ఈ క్లారిటీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com