సెంటరాఫ్ అట్రాక్షన్ తో స్కూల్ పాపలా ప్రత్యక్షమైన ఆలియా.. వీధిలో చూపులన్నీ తన పైనే

  Written by : Suryaa Desk Updated: Sun, Jun 13, 2021, 11:08 AM

కోవిడ్ 19 మహమ్మారి దేశంలో ప్రవేశించి సంవత్సరం దాటింది. భారతదేశం చాలా నెలలు లాక్ డౌన్ లోనే ఉండిపోయింది. 2020- 2021 సీజన్ లో ఘోరమైన వైరస్ పర్యవసానాలు చూశాం. సెకండ్ వేవ్ లో దేశం ధైన్య స్థితిలోకి వెళ్లింది. చివరకు పరిస్థితి అదుపులోకి రావడంతో మహారాష్ట్ర సహా పలు నగరాల్లో ఆంక్షల్ని సడలించారు. లాక్ డౌన్ సడలింపు ఇవ్వగానే ముంబైలో సెలబ్రిటీలు ఇండ్ల నుంచి బయటకు వస్తున్నారు. తాజాగా అలియా భట్ తన గాళ్స్ గ్యాంగ్ తో కలిసి షాపింగుకి వెళ్లింది. తన పాఠశాల స్నేహితులు సోదరి షాహీన్ భట్ తో కలిసి సిటీలో షికార్ చేస్తూ కనిపించింది.


ఇక ఈ బ్యాచ్ లో ఆలియాపైనే వీధిలో చూపులన్నీ ప్రసరించాయి. అంతగా సెంటరాఫ్ అట్రాక్షన్ తో కట్టి పడేసింది ఆలియా.  డే అవుట్ కోసం సాధారణం లుక్ ఎంచుకున్నా కానీ చూసేందుకు స్కూల్ పిల్లలా ఎంతో క్యూట్ గా కనిపించింది. గులాబీ రంగు స్వెట్ షర్ట్ బ్లాక్ షార్ట్ ను ధరించిన ఆలియా .. క్రిస్టియన్ డియోర్ బుక్ టోట్ బ్యాగ్ తో ప్రత్యక్షమైంది. COVID 19 ప్రోటోకాల్ ప్రకారం ముసుగు ధరించి కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ఆర్.ఆర్.ఆర్- బ్రహ్మాస్త్ర - గంగూభాయి కతియా వాడీ లాంటి భారీ చిత్రాల్లో నటిస్తున్న ఆలియా తదుపరి నాలుగైదు స్క్రిప్టుల్ని లాక్ చేసిందని తెలిసింది. చరణ్ -శంకర్ కలయికలోని పాన్ ఇండియా మూవీలోనూ నటించే వీలుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
Recent Post