హిందీ రీమేక్ దిశగా 'అల వైకుంఠపురములో'

  Written by : Suryaa Desk Updated: Sun, Jun 13, 2021, 01:29 PM

త్రివిక్రమ్ .. అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. పూజ హెగ్డే కథనాయికగా అలరించిన ఈ సినిమాను, తమన్ మ్యూజికల్ హిట్ గా నిలబెట్టాడు. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. దాంతో ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ కోసం బాలీవుడ్ కి చెందిన బడా నిర్మాతలు పోటీపడ్డారు. కానీ అల్లు అరవింద్ అందుకు ఆసక్తిని చూపలేదు. ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు.


'అల వైకుంఠపురములో' సినిమాను ఏ భాషలోనైనా రీమేక్ చేసుకోవచ్చు. కథాకథనాల పరంగా .. నేపథ్యం పరంగా  అలాంటి సౌలభ్యం ఉంది. అందువలన హిందీలో రీమేక్ చేయడానికి అల్లు అరవింద్ రెడీ అవుతున్నారని అంటున్నారు. తెలుగులో అల్లు అర్జున్ చేసిన పాత్రలో కార్తీక్ ఆర్యన్ ను .. పూజ హెగ్డే చేసిన పాత్రలో కృతి సనన్ ను అనుకుంటున్నారట. కరోనా ప్రభావం తగ్గిన తరువాత ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలనే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. ఈ లోగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా విషయాలను కూడా వెల్లడించే అవకాశం ఉంది. 
Recent Post