మాల్దీవులలో మెరిసిపోతున్న దిశా అయిలీ టోన్డ్ బాడీ

  Written by : Suryaa Desk Updated: Sun, Jun 13, 2021, 03:01 PM

దిశా పటానీ నిరంతర ఇన్ స్టా ట్రీట్ గురించి తెలిసిందే. ఇటీవల లాక్ డౌన్ సమయంలో మాల్దీవుల విహారం నుంచి వేడెక్కించే బికినీ ఫోటోలను వీడియోలను షేర్ చేయగా ఇంటర్నెట్ లో దుమారం రేపాయి. తాజాగా ఈ బ్యూటీ బీచ్ వెకేషన్ నుండి త్రోబాక్ ఫోటోను షేర్ చేయగా వైరల్ గా మారింది. బికినీ ధరించి దిశా సముద్రపుటంచున మెరిసే నీటి ముందు కూర్చుని కనిపిస్తోంది. దిశా టోన్డ్ బాడీని పొడుగు కాళ్ల అందాలను ఎలివేట్ చేస్తూ కెమెరాకు పోజులిచ్చింది. దిశా ఎండలో చెమటలు పట్టి ఆయిలీ టోన్డ్ లుక్ తో మెరిసిపోతోంది. ఇంతకుముందు దిశా డిన్నర్ డేట్ కి సంబంధించిన కొన్ని ఫోటోలను పంచుకున్నారు. నల్లని దుస్తులలో ధరించిన దిషా మేకప్ లేకుండా తన సహజ సౌందర్యంతో ఆకట్టుకుంది. దిశా షేర్ చేస్తున్న ప్రతి ఫోటోకి కుటుంబం.. స్నేహితులు.. అభిమానుల నుండి కామెంట్లు ఈమోజీలు షేర్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటో లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. 
Recent Post