బాలీవుడ్ అడుగుపెట్టిన రష్మిక మందన!

  Written by : Suryaa Desk Updated: Mon, Jun 14, 2021, 11:06 AM

హీరోయిన్ రష్మిక అటు కన్నడ, తమిళ సినిమాలలో కూడా నటిస్తోంది. మరోపక్క ఇటీవల బాలీవుడ్ ప్రవేశం కూడా చేసిన సంగతి విదితమే. హిందీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తొలిగా ‘మిషన్ మజ్ను’ అనే సినిమాలో నటించడానికి ఒప్పుకుంది. ఈ చిత్రానికి శంతను బాగ్చి దర్శకత్వం వహిస్తుండగా, సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్నాడు.మహారాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలను సడలించి, అనుమతులు ఇవ్వడంతో ముంబైలో తిరిగి షూటింగులు మొదలవుతున్నాయి. ఈ క్రమంలో కథానాయిక రష్మిక కూడా 'గుడ్ బై' హిందీ చిత్రం షూటింగులో పాల్గొనడానికి నిన్న ముంబై చేరుకుంది. ఈ చిత్రంలో అమితాబ్, రష్మిక తండ్రీకూతుళ్లుగా నటిస్తున్నారు.
Recent Post