కాజల్ అగర్వాల్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కెరీర్ మొదలై 15 ఏళ్లైనా కూడా ఇప్పటికీ అదే జోరు చూపిస్తోంది ఈ అందాల చందమామ. ఇప్పటికీ వరుస సినిమాలతో అదరగొడుతోనే ఉంది. కాగా ఇటీవల పెళ్లి చేసుకున్న కాజల్ మరోసారి హీట్ పెంచింది. ప్రస్తుతం ఈ భామ చిరంజీవి ‘ఆచార్య’లో నటిస్తోంది. మరోవైపు నాగార్జున, ప్రవీణ్ సత్తారు మూవీతో పాటు కమల్ హాసన్ ‘భారతీయుడు 2’లో కథానాయికగా నటిస్తోంది.