ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బైకు ప్రమాదంలో కన్నడ నటుడు మృతి!

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 14, 2021, 02:42 PM



రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలైన ప్రముఖ నటుడు సంచారి విజయ్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. సంచారి విజయ్ ప్రాణాలు రక్షించడానికి బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రి వైద్యులు 36 గంటలు అందించినా చికిత్స విఫలం అయ్యింది. బహుబాష నటుడు, సినీ నిర్మాత, దర్శకుడు ఈగ ఫేమ్ కిచ్చ సుదీప్ సైతం సంచారి విజయ్ ప్రాణాలు కాపడటానికి ఆర్థిక సహాయం చేసి ప్రతినిత్యం ఆయన ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నేషనల్ అవార్డు విన్నర్ సంచారి విజయ్ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆయన మృతికి కన్నడ చిత్రసీమ ప్రముఖులతో పాటు కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్ప, రాజకీయాలకు అతీతంగా పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. సంచారి విజయ్ అవయవాలు అన్నీ దానం చెయ్యాలని ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించారు.అతడి ఆరోగ్య పరిస్థితిని బట్టి తల ఆపరేషన్ ఉంటుందని కూడా వైధ్యులు చెప్పారు. ఆపరేషన్ నిర్వహించాలని భావిస్తున్న సమయంలో తుది శ్వాస విడిచాడట. వర్మ తెరకెక్కించిన కిల్లింగ్ వీరప్పన్ మొదలుకుని ఎన్నో కన్నడ సినిమాల్లో నటించి మెప్పించిన సంచారి విజయ్ మృతిపై కన్నడ సినీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com