ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టాలీవుడ్ వారసుగా ఆఫర్స్ వస్తున్న అవికా గోర్ !

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 15, 2021, 12:59 PM



'ఉయ్యాలా జంపాలా' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ అవికా గోర్. ఈ సినిమా విజయవంతమవడంతో.. ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి. ఆ తరువాత 'సినిమా చూపిస్త మావ' .. ' ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమాలు అవికా క్రేజ్ ను మరింత పెంచాయి. యూత్ లో ఈ పిల్లకి ఓ రేంజ్ లో ఫాలోయింగ్ పెరిగిపోయింది. కానీ, ఆ తరువాత సరైన హిట్ లేకపోవడంతో... ఈ అమ్మడికి అవకాశాలు తగ్గిపోయాయి.తాజాగా టాలీవుడ్లో అవికా గోర్ పేరు వినిపిస్తోంది. వరుసగా ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం. చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ కొత్త ప్రాజెక్ట్ లో అవికా గోర్ ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక మరో సినిమాను రాజ్ తరుణ్ తో చేయనుంది. ఇన్ స్టాగ్రాంలో ఈవిషయాన్ని షేర్ చేశాడు ఈ యంగ్ హీరో. అవికా తన బెస్ట్ ఫ్రెండ్ అనీ .. త్వరలోనే ఆమెతో ఒక సినిమా చేయనున్నానని తెలిపాడు. అయితే వీరి కాంబో లో ముచ్చటగా మూడో సినిమా రానుంది. ఈ సినిమా హిట్ అయితే, అవికా గోర్, రాజ్ తరుణ్ జంట హిట్ ఫెయిర్ గా నిలవనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com