దేశంలో మొదటి థియేటర్ ఇదే

  Written by : Suryaa Desk Updated: Thu, Jul 22, 2021, 01:41 PM

సినిమా వెండి తెర మీద చూస్తేనే ఫుల్ మజా. ఎంత ఫ్రీగా సినిమాని టీవీలో చూపించినా థియేటర్ కి వెళ్లి సినిమా చూస్తే ఆ కిక్కే వేరు. ఇప్పుడు సినిమా థియేటర్లు పూర్తి ఆధునికత తో మెరిసిపోతున్నాయి. కానీ, సినిమా కంటే పూర్వం వినోదం అంటే నాటకం. వీధుల్లో నాలుగు రోడ్ల కూడళ్లలో ఊర్లలోని దేవాలయాలు, ఇలా ఎక్కడ పడితే అక్కడ నాటకాలు వేస్తుండేవారు. నాటకాలు వేయడానికి ప్రత్యేకంగా వేదిక ఉండేది కాదు. కానీ, ఈ రోజుకు సరిగ్గా 138 సంవత్సరాల క్రితం ఒక ప్రత్యేకమైన థియేటర్ నాటకాల కోసం ప్రారంభించారు. దేశంలో తొలి థియేటర్ ఇదే. మొదట్లో ఈ థియేటర్ లో నాటకాలు ప్రదర్శించినా తరువాత ఇక్కడ సినిమాల ప్రదర్శన కూడా కొనసాగింది. సరిగ్గా ఈరోజున (జూలై, 21) 1883 లో కోల్‌కతాలోని స్టార్ థియేటర్ ప్రారంభం అయింది. దీనిని భారతదేశంలో మొట్టమొదటి పబ్లిక్ థియేటర్‌గా చెబుతారు. 21 జూలై 1883 న, ఈ థియేటర్‌లో ‘దక్షి యజ్ఞ’ అనే నాటకం ప్రదర్శించారు. ఈ నాటకాన్ని గిరీష్ చంద్ర ఘోష్ రాశారు. అదేవిధంగా ఆయన అందులో ప్రధాన పాత్రను పోషించారు.
Recent Post