తమిళ పవర్‌ స్టార్‌తో వనిత నాలుగో పెళ్లి?

  Written by : Suryaa Desk Updated: Thu, Jul 22, 2021, 02:12 PM

మూడు పెళ్లిళ్లు, వివాదాలు, విడాకులు, విమర్శలతో సంచలన నటిగా ముద్ర వేసుకుంది వనిత విజయ్‌కుమార్‌ . సీనియర్‌ నటుడు విజయ్‌, నటి మంజుల దంపతుల పెద్ద కూతురే వనిత. 'చంద్రలేఖ' చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన ఆమె తమిళ బిగ్‌బాస్‌ షోలోనూ పాల్గొని తరచూ వార్తల్లో నిలిచింది. అయితే ఆమె త్వరలోనే నాలుగో పెళ్లి చేసుకోబోతుందంటూ ఓ జ్యోతిష్యుడు జోస్యం పలికిన వీడియో ఒకటి ఆ మధ్య తెగ వైరల్‌ అయింది. వనితతో ఏడడుగులు నడిచే వ్యక్తి పేరు 'S' అక్షరంతో మొదలవుతుందని అతడు హింట్‌ కూడా ఇచ్చాడు. అంతేకాక ఆమె రాజకీయాల్లోకి కూడా ఎంటరవుతుందని, దివంగత సీఎం జయలలితలా పాలిటిక్స్‌లోనూ తన సత్తా చాటుతుందని పేర్కొన్నాడు.


ఇదిలా వుంటే తాజాగా వనిత పెళ్లి ఫొటోను షేర్‌ చేసి అభిమానులకు షాకిచ్చింది. పవర్‌ స్టార్‌ శ్రీనివాసన్‌తో పూలదండలు మార్చుకుంటున్న స్టిల్‌ను సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేసింది. దీంతో ఆమె మళ్లీ పెళ్లి చేసుకుందా? అని కొందరు అభిమానులు అయోమయానికి లోనయ్యారు. ఆ జ్యోతిష్యుడు చెప్పింది నిజమైందంటూ మరికొందరు శుభాకాంక్షలు చెప్తున్నారు. అయితే ఇది నిజమైన పెళ్లి కాదు, ప్రస్తుతం తను చేస్తున్న ఓ సినిమాలోని స్టిల్‌ ఇది. మొత్తానికి ఈ ఫొటో మాత్రం నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది.
Recent Post