నగరంలో రేపటి నుంచి సినిమా థియేటర్లు ఓపెన్‌

  Written by : Suryaa Desk Updated: Thu, Jul 22, 2021, 02:15 PM

సినీ ప్రియుల నిరీక్షణకు ఇక తెర పడనుంది. వెండితెర లేవనుంది. రాష్ట్రంలో సినిమా థియేటర్లు ప్రేక్షకులతో మళ్లీ కళకళలాడను న్నాయి. నగరంలో రేపటి నుంచి సినిమా థియేటర్లను ఓపెన్‌ చేయనున్నారు. రేపటి నుంచి 15 సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లు, 30వ తేది నుంచి మల్టీప్లెక్సులు, ఇతర సినిమా హాళ్లు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం 'నేరగాడు' అనే లోబడ్జెట్‌ చిత్రాన్ని ఈ థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ఈనెల 30 నుంచి పెద్ద సినిమాలు విడుదల వుతుండటంతో అదేరోజు మల్టీప్లెక్సులు, ఇతర థియేటర్లు ఓపెన్‌ కానున్నాయి. కాగా సినిమా థియేటర్లలో ఇకపై పార్కింగ్‌ చార్జీలు వసూలు చేయనున్నారు. పార్కింగ్‌ ఫీజుల వసూలుకు ప్రభుత్వం అనుమతిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా మల్టీప్లెక్స్‌, మాల్స్‌, కమర్షియల్‌ కాంప్లెక్స్‌ల్లో పార్కింగ్‌ ఫీజులు వసూలు చేయరాదని, అక్కడ పాత పద్ధతినే కొనసాగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Recent Post