ఎన్టీఆర్ తనయుడుకి బర్త్‌డే విషేస్ చెబుతూ సోషల్ మీడియా లో మోత!

  Written by : Suryaa Desk Updated: Thu, Jul 22, 2021, 02:43 PM

ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అభయ్ రామ్ పుట్టినరోజు..యంగ్ టైగర్ ఎన్టీఆర్, భార్య లక్ష్మీ ప్రణతి దంపతుల కుమారులు అభయ్ రామ్, భార్గవ రామ్‌‌ల పిక్స్ సోషల్ మీడియాలో తారక్ ఫ్యాన్స్ భలే వైరల్ చేస్తుంటారు. ఇక వారి బర్త్‌డే వచ్చిందంటే హంగామా మామూలుగా ఉండదు.  అయితే ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అభయ్ రామ్ పుట్టినరోజు.. ఈ సందర్భంగా తమ అభిమాన నటుడి ముద్దుల తనయుడుకి అభిమానులు విషెష్ చెబుతూ ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో అభయ్ రామ్ ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు. అభయ్ రామ్‌కి నందమూరి ఫ్యాన్స్‌తో పాటు, సినీ ఇండస్ట్రీ వారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తారక్ ప్రస్తుతం రామ్ చరణ్‌తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నారు. తర్వాత కొరటాల శివ, ‘కె.జి.యఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో మూవీస్ కమిట్ అయ్యారు.
Recent Post