'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న భారీ చిత్రం షూటింగ్ ఇటీవలే హైదరాబాదులో మొదలైంది. ఈ చిత్రం కోసం ప్రభాస్ 200 రోజులు కేటాయించినట్టు చెబుతున్నారు. త్వరలోనే ఆయన ఈ చిత్రం షూటింగులో పాల్గొంటాడు. దీపిక పదుకొణే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దీనికి 'ప్రాజక్ట్ కె' అనే వర్కింగ్ టైటిల్ నిర్ణయించారు.