పోర్నోగ్రఫీ కేసు లో త‌న ఫొటోలు, వీడియోలను వాడుతున్నమీడియా సంస్థ‌లు పై పరువునష్టం దావా వేసిన శిల్పాశెట్టి

  Written by : Suryaa Desk Updated: Fri, Jul 30, 2021, 11:39 AM

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఉన్న మంచి పేరు ఆమె భర్త రాజ్ కుంద్రా వ‌ల్ల పాడైపోతోంది. నీలి చిత్రాల కేసులో ఆమె భ‌ర్త రాజ్ కుంద్రా విచార‌ణ ఎదుర్కొంటోన్న విష‌యం తెలిసిందే. నీలి చిత్రాల వ్య‌వ‌హారంలో శిల్పా శెట్టి పాత్ర కూడా ఉంద‌ని పోలీసులు చెప్ప‌క‌పోయిన‌ప్ప‌టికీ మీడియాలో ఆమెపై అనేక ర‌కాల క‌థ‌నాలు వ‌స్తుండ‌డంతో ఆ హీరోయిన్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.


త‌న భ‌ర్త‌పై కేసు న‌మోదైతే త‌న ఫొటోలు, వీడియోలను కూడా మీడియా వాడుతుండ‌డం ప‌ట్ల అభ్యంత‌రాలు తెలిపింది.  మీడియా సంస్థలపై ఆమె ముంబై హైకోర్టులో పరువునష్టం దావా వేసింది. త‌న‌ పరువు ప్రతిష్ఠ‌కు భంగం కలిగించేలా కథనాలను రాశాయ‌ని తెలిపింది. ప‌లు జాతీయ మీడియా సంస్థలు, పలువురు జర్నలిస్టులపై ఆమె వేసిన‌ పరువునష్టం దావా ఈ రోజు విచారణకు రానున్నట్లు తెలుస్తోంది. కాగా, కొన్ని రోజుల క్రితం అరెస్ట‌యిన‌ శిల్పా శెట్టి భ‌ర్త ప్ర‌స్తుతం జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. ఈ స‌మ‌యంలో శిల్పా శెట్టిపై జాతీయ‌ మీడియాపై అనేక ర‌కాల‌ క‌థ‌నాలు ప్ర‌చురిత‌మ‌వుతున్నాయి.
Recent Post