సూపర్ ట్విస్టులు తో హిట్ టాక్ తెచ్చుకున్న సత్యదేవ్ 'తిమ్మరుసు'

  Written by : Suryaa Desk Updated: Fri, Jul 30, 2021, 12:11 PM

కరోనా ఉదృతి తగ్గుముఖం పట్టడం తో మళ్లీ థియేటర్స్ ఈరోజు నుండి ఓపెన్ అయ్యాయి. ఈ తరుణంలో సత్యదేవ్ నటించిన ‘తిమ్మరుసు’ చిత్రం ముందుగా థియేటర్లలో సందడి చేస్తుంది ‘తిమ్మరుసు’ ప్రీమియర్స్ చూసిన జనం చేస్తున్న ట్వీట్లను బట్టి చూస్తే ఈ సినిమా అంచనాలను రీచ్ అయినట్లే తెలుస్తోంది. ఈ చిత్రంలో ట్విస్టులు బాగున్నాయని, అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ ఆకట్టుకుందని అంటున్నారు. క్లైమాక్స్ కూడా సినిమాకు ప్లస్ అనే ట్వీట్స్ కనిపిస్తున్నాయి. ఇక యాక్టర్ సత్యదేవ్ నటన అద్భుతం అని చెబుతున్నారు. శ్రీ చరణ్ పాకాల అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుందని, యాక్టర్ బ్రహ్మాజీ క్లాస్ కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయని అంటున్నారు. మొత్తానికైతే ఈ సినిమా సూపర్ హిట్ అని తేల్చి చెపుతున్నారు. 
Recent Post