రానా “విరాటపర్వం” ఆ డీల్ క్యాన్సిల్ చేసుకుందా?

  Written by : Suryaa Desk Updated: Fri, Jul 30, 2021, 12:53 PM

దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వంలో  రానా దగ్గుబాటి హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం “విరాట పర్వం” . ఈ సినిమా రిలీజ్ కి రెడీగా ఉన్న సంగతి తెలిసిందే.  ఈ చిత్రం ఆసక్తికర క్యాస్టింగ్ తో తెరకెక్కింది. అయితే పలు చిత్రాలు సహా వారి ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన సినిమాలు కూడా ఓటిటి దారిలోనే ఉన్నాయి అన్నప్పుడు నుంచి రానా విరాట పర్వం పై కూడా బజ్ వచ్చింది. ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ వారు డైరెక్ట్ ఓటిటి రిలీజ్ చేయనున్నారని. కానీ ఇప్పుడు తాజా టాక్ ఏమిటంటే మేకర్స్ ఆ డీల్ ను క్యాన్సిల్ చేసుకున్నారని టాక్ వినిపిస్తుంది. వారు థియేట్రికల్ రిలీజ్ కే మొగ్గు చూపుతున్నారట. అందుకే ఓటిటి రిలీజ్ వద్దనుకున్నారని తెలుస్తుంది. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. 
Recent Post