నేను ఇప్పుడు కప్పలా ఉన్నాను... మరి మీరు.? : రాధికా ఆప్టే

  Written by : Suryaa Desk Updated: Fri, Jul 30, 2021, 01:06 PM

రాధికా ఆప్టే..ఈ పేరును కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు..తెలుగులో రెండే సినిమాలు చేసినప్పటికీ బాలీవుడ్ లో అమ్మడు ఏ రేంజ్ లో రెచ్చిపోతుందో చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం సినిమాలతోనే కాదు సోషల్ మీడియా లో హాట్ హాట్ కామెంట్స్, మత్తికేంచే పిక్స్ తో ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా ఈ భామ కప్పలా కూర్చొని, అదికూడా టూపీస్‌ దుస్తులు ధరించి దిగిన ఫొటోలు నెటిజన్లకు కనువిందు చేస్తున్నాయి. ఒక పార్కులో చెత్త వేసేందుకుగాను కప్ప ఆకారంతో తయారు చేసిన డస్ట్‌బిన్‌ను పెట్టారు. ఈ పార్కుకు వెళ్ళిన ఈ బాలీవుడ్‌ భామ… ఆ డస్ట్‌బిన్‌ పక్కన కూర్చొని అచ్చం కప్పలాగే కూర్చొని ఫొటోలు దిగి వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ఆ ఫొటోల కింద ‘ప్రతి ఒక్కరూ జంతువే. నేను ఇప్పుడు కప్పలా ఉన్నాను. మీరు ఏ జంతువు?’ అంటూ ఓ కామెంట్‌ను వదిలింది.




Recent Post