సంతోష్ జాగర్ల పుడి దర్శకత్వం లో నాగ శౌర్య హీరో గా కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం 'లక్ష్య'. ఈ సినిమా నుంచి సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు. నాగ శౌర్య మరియు కేతికా శర్మ లు కలిసి ఉన్న ఆ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారుతోంది. శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.నారాయణ్ దాస్ నరంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ లు ఈ చిత్రానికి నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు. సృజనమాని చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నారు. కాల భైరవ చిత్రం కి సంగీతం అందిస్తున్నారు.