వాణిజ్య ప్రకటనలతో కోట్లు కొల్లగొడుతున్న టాప్ స్టార్లు వీరే..

  Written by : Suryaa Desk Updated: Fri, Jul 30, 2021, 03:15 PM

ఇటీవల కరోనా నేపథ్యంలో ఆన్ లైన్ సేల్ మరీ ఎక్కువైంది. ప్రతిదీ ఇక ఆన్ లైన్.. అన్నంతగా మారింది. అయితే ఇది పలువురు అగ్ర హీరోలకు ఆదాయ వనరుగా మారింది. ఇ-కామర్స్ దిగ్గజాలకు ప్రచారం చేస్తూ కోట్లు కొల్లగొట్టేందుకు సదరు హీరోలకు అవకాశం కలిగింది....  ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజాలు పలువురు హీరోలతో ఒప్పందాలు చేసుకోవడం చర్చనీయాంశమైంది. హృతిక్- దేవరకొండ- దుల్కార్ - సమంత- కియరా .. పేర్లు తాజాగా రివీలయ్యాయి. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. దేశవ్యాప్తంగా హృతిక్ కి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. హృతిక్ బ్యాక్ టు బ్యాక్ క్రేజీ చిత్రాలతో సంచలనాలు సృష్టిస్తున్నారు. ఇక టాలీవుడ్ నుంచి రౌడీ విజయ్ దేవరకొండ అనతి కాలంలోనే బిగ్ స్టార్స్ జాబితాలో స్థానం సంపాదించారు. `అర్జున్ రెడ్డి` విజయం తనకు పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ని తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రిలీజ్ అయిన గీతగోవిందం టాలీవుడ్ లో ఇమేజ్ ని రెట్టింపు చేసింది. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ 10 హీరోల జాబితాలో దేవరకొండ ఒకరు. ఇక మలయాళం స్టార్ మమ్ముట్టి తనయుడిగా పరిశ్రమలోకి అడుగు పెట్టిన దుల్కార్ సల్మాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. సౌత్ లోనే మోస్ట్ హ్యాండ్ సమ్ హీరోగా అతడు దూసుకుపోతున్నారు. దుల్కార్ బాలీవుడ్ లోనూ తనదైన మార్క్ వేస్తున్నారు.


ఇక సమంత అక్కినేని ఫ్యామిలీ ఇంట కోడలిగా అడుగు పెట్టిన తర్వాత తనకు మరింత పాపులారిటీ పెరిగింది. ఫ్యామిలీమ్యాన్ 2లో రాజీగా తనదైన నటనతో యూనివర్శల్ స్టార్ గా ఎదిగారు సామ్. అలాగే `భరత్ అనేనేను` సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కియారా అద్వానీ ఇప్పుడు బాలీవుడ్ సహా ఇతర భాషల్లో బిజీ నటిగా కొనసాగుతోంది. తాజాగా ఆ ఐదుగురు బిగ్ స్టార్స్ ని భారతీయ అతిపెద్ద ఈ కామర్స్ దిగ్గజ సంస్థ తమ ప్రచారకర్తలుగా నియమించుకుంది. వీరంతా కలిసి ఉన్న ఓఫోటోని ట్విటర్ వేదికగా పంచుకుని ప్రకటనలకు సిద్ధమవుతున్న విషయాన్ని కన్ఫామ్ చేశారు.


ఈ సందర్భంగా ఈ ఆదుగురి మధ్య ఆసక్తికర డిస్కషన్ చోటు చేసుకుంది. ముందుగా హృతిక్ తన ఫోటోను షేర్ చేసి.. “హే @అద్వానీ_కియారా. ఇది చాలా మంచిదని మీరు అనుకుంటున్నారా? అని ప్రశ్నించగా దానికి బదులుగా “సరిపోదు.. కానీ ఇప్పుటి వరకూ మంచిదే. @దేవరకొండ మీరు ఏమనుకుంటున్నారు అని ట్యాగ్ చేసారు. విజయ్ దేవరకొండ కూడా అలాగే ప్రతి స్పందించారు “అందమైనది. కానీ సరిపోదు... దీనికి కొంత రౌడీయిజం అవసరం అని అతడు @సమంతప్రభు మీరు ఆమోదిస్తారా? అని ట్యాగ్ చేస్తూ ప్రశ్నించగా “హహాహా... లేదు. కానీ దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో నాకు తెలుసు అని! @ దుల్కార్ సల్మాన్ ని ఇది చేయగలదని మీరు అనుకుంటున్నారా? అని ట్యాగ్ చేస్తూ ప్రశ్నించగా దానికి ఆయన ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి ఏం కావాలో నాకు తెలుసునని ముగించారు. మొత్తానికి ఐదుగురు స్టార్లు ఇ-కామర్స్ దిగ్గజానికి ఎవరి భాషలో వారు ప్రచారం చేస్తుండడం ఆసక్తికరం. ఈ ప్రచారం కోసం కోట్లాది రూపాయల డీల్ కి ఓకే చెప్పారని భావిస్తున్నారు.


సదరు హీరోలలో హృతిక్ ఒక్కో సినిమాకి 80కోట్లు పైగా ఆర్జిస్తుంటే ఇతరుల్లో విజయ్ .. దుల్కార్ ఒక్కో సినిమాకి 10కోట్ల పారితోషికం మార్కులో ఉన్నారు. సమంత రూ.3కోట్ల రేంజు పారితోషికం అందుకుంటుండగా.. కియరా బాలీవుడ్ లో 4కోట్ల వరకూ అందుకుంటున్నారని సమాచారం. వాణిజ్య ప్రకటనలతోనూ వీరంతా భారీగానే ఆర్జిస్తున్నారు.
Recent Post