బాలీవుడ్ ఎంట్రీ పై అమితాబ్ మనవరాలు క్లారిటీ

  Written by : Suryaa Desk Updated: Fri, Jul 30, 2021, 04:30 PM

బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బి అమితాబ్, తన ముద్దుల మనవరాలు నవ్య నవేలి సినిమాల్లో నటించే విషయం గురించి క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నవేలి తాజాగా ఇన్‌స్టాలో పింక్ కలర్ డ్రెస్‌లో ఉన్న ఓ ఫోటో షేర్ చేసింది. ఈ సందర్భంగా కొందరు నెటిజన్లు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇక ఇదే సమయంలో ఓ నెటిజన్ ఆమె సినిమా ఎంట్రీ గురించి అడిగారు. ‘మీరు చాలా అందంగా ఉన్నారు.. బాలీవుడ్‌లో యాక్ట్ చెయ్యొచ్చు కదా?’ అని ప్రశ్నించాడు.. అతడి ప్రశ్నకు కూల్‌గా సమాధానం చెప్పింది నవ్య.. ‘అందమైన మహిళలు సినిమాల్లోనే కాదు వ్యాపారంలోనూ రాణించగలరు’ అంటూ రిప్లై ఇచ్చింది.


ఆమె ఎంతో హుందాగా ఇచ్చిన రిప్లై గురించి పలువురు బాలీవుడ్ స్టార్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో నవ్య మాట్లాడుతూ.. ‘‘మా వంశంలో నాలుగో తరాన్ని మొదటి మహిళగా నేనే ముందుండి నడిపించాలని అనుకుంటున్నాను. ఒక గొప్ప వంశాన్ని నడిపించే అవకాశం రావడం నాకు నిజంగా గొప్ప గౌరవంగా భావిస్తున్నాను’’ అని చెప్పింది.


నవ్య నవేలి సినిమాల్లో నటించే అంశంపై ఆమె తల్లి శ్వేతా బచ్చన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘అనుకున్నవి అనుకున్నట్లు జరగకపోతే తన తండ్రి అమితాబ్‌, తన సోదరుడు అభిషేక్‌ ఎంతలా కుంగిపోయేవారో తాను స్వయంగా చూశానని అందుకే తన కూతురు సినిమాల్లోకి రాకపోవడమే మంచిదని తాను భావిస్తున్నానని’ తెలిపారు. ‘సినిమా సరిగా ఆడితే ఈ సమస్య ఉండదు సరిగా ఆడకపోతేనే అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. అభిమానులు ఇతర సినీ ప్రేమికులు ట్రోల్ చేస్తూ విమర్శిస్తుంటారు.. అటువంటివి తాను స్వయంగా చూశానని’ అన్నారు. అలాంటివి చూసినప్పుడు తాను జీర్ణించుకోలేకపోయేదాన్నని, తన కూతురు బిజినెస్‌లో ఉండటమే మంచిదని తాను భావిస్తున్నట్లుగా తెలిపారు శ్వేతా బచ్చన్.
Recent Post