'పవన్ – రానా ’ మూవీ డబ్బింగ్ రైట్స్ కి భారీ ధర...?

  Written by : Suryaa Desk Updated: Sat, Jul 31, 2021, 12:09 PM

దర్శకుడు సాగర్ కె చంద్ర దర్శకత్వంలో క్రేజీ మల్టీ స్టారర్ చిత్రాల్లో  పవన్ కళ్యాణ్ మరియు రానా నటిస్తున్న చిత్రం కూడా ఒకటి. యువ  తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు శరవేగంగా షూటింగ్ ను జరుపుకొని సిద్ధం అవుతుంది. అయితే మళయాళ బ్లాక్ బస్టర్ అయ్యప్పణం కోషియం కు రీమేక్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ బజ్ వైరల్ అవుతుంది. ఈ చిత్రం హిందీ డబ్బింగ్ హక్కులు భారీ మొత్తంలో అమ్ముడుపోయాయని ఇపుడు టాక్ నడుస్తుంది. దాదాపు 23 కోట్ల మేర ఈ చిత్రానికి హక్కులు పలికినట్టు టాక్. అయితే ఇందులో ఎలాంటి అధికారిక క్లారిటీ లేదు కానీ సినీ వర్గాల్లో అయితే ఈ మాటే నడుస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమో చూడాలి.
Recent Post