హ్యాపీ బర్త్ డే కియారా అద్వానీ.. పుట్టిన రోజు నాడు మరో సూపర్ ఛాన్స్

  Written by : Suryaa Desk Updated: Sat, Jul 31, 2021, 12:16 PM

భారత్ టాప్ డైరక్టర్లలో శంకర్ ఒకరు. ఆయన సినిమాలలో యాక్షన్‌ తో పాటు సందేశం కూడా ఉంటుంది. శంకర్‌ ప్రస్తుతం తెలుగులో రాం చరణ్‌‌తో కలిసి సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. పాన్‌ ఇండియా సినిమాగా శంకర్‌ తెరకెక్కిస్తున్నాడు. దిల్‌ రాజ్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుండగా… థమన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌‌గా చేస్తున్నారు. ఇక దిల్‌ రాజ్‌‌కు ఈ సినిమా 50వ సినిమా కావడం గమనార్హం. అయితే.. ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్ర కోసం మొదట సౌత్‌ కొరియన్‌ నటి సుజీ బేను తీసుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి. తర్వాత కియారా అద్వానీ, అలియా భ‌లతో సహ పలువురి పేర్లు వినిపించినా.. హీరోయిన్‌ ఎవరనే దానిపై క్లారిటీ రాలేదు. తాజాగా ఈ సినిమా హీరోయిన్‌‌ను దర్శకుడు శంకర్‌ అఫిషీయల్‌‌గా ప్రకటించేశాడు. కియారా అద్వానీ పుట్టిన రోజు నేపథ్యంలో…ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ సరసన కియారా అద్వానీ నటిస్తున్నారంటూ ప్రకటించారు. 
Recent Post