“ఎఫ్ 3” రిలీజ్ అప్పుడేనా ?

  Written by : Suryaa Desk Updated: Sat, Jul 31, 2021, 01:04 PM

 దర్శకుడు అనీల్ రావిపూడి దర్శకత్వంలో వెంకీ మామ మరియు వరుణ్ తేజ్ ల కాంబోలో వచ్చిన క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం “ఎఫ్ 2” అని చెప్పాలి. ఏడాది వ్యవధిల్లోనే వచ్చిన ఈ చిత్రం కూడా సంక్రాంతి రేస్ లో భారీ హిట్స్ గా నిలిచాయి. అయితే ఈ “ఎఫ్ 2” కి సీక్వెల్ గా అదే తారాగణంతో తెరకెక్కిస్తున్న “ఎఫ్ 3” పై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే వచ్చే మళ్ళీ ఏడాది సంక్రాంతి రేస్ లోనే ఈ సినిమాని రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ చేసారు. అయితే ఒక్కొక్కటిగా ఈ రేస్ లో బడా సినిమాలే నిలుస్తూ వచ్చాయి. అయితే ఈ రేస్ లో తమ సినిమా కూడా ఉందని వెంకీ మామ నిన్న జరిగిన “నారప్ప” సక్సెస్ మీట్ లో తెలిపారు. దీనితో సంక్రాంతి రేస్ లో ఈ చిత్రం కూడా కన్ఫర్మ్ అని చెప్పాలి. ఫ్యామిలీ ఆడియెన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ చిత్రం అప్పుడు ఎలా పెర్ఫామెన్స్ చేస్తుందో చూడాలి.
Recent Post