బన్నీ “పుష్ప” కోసం సూపర్ ట్విస్ట్ ప్లాన్ చేశారంట...?

  Written by : Suryaa Desk Updated: Sat, Jul 31, 2021, 01:45 PM

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా, రష్మికా  హీరోయిన్‌గా తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”.  ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే పుష్పలో సుకుమార్ ఓ బిగ్ ట్విస్ట్ ప్లాన్ చేస్తున్నాడన్న వార్త ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లో హాట్ టాఫిక్‌గా మారింది. ఈ చిత్రంలో మళయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ సాలిడ్ విలన్ రోల్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే టాలీవుడ్‌లో కమెడియన్‌గా, హీరోగా మెప్పించిన సునీల్ కూడా పుష్పలో కీరోల్ చేస్తున్నాడు. డిస్కో రాజా, కలర్ ఫోటో మూవీతో విలన్‌గా మారి మెప్పించిన సునీల్‌ను సుకుమార్ మెయిన్ విలన్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నాడని టాక్. మెయిన్ విలన్ ఫహద్ ఫాజిల్ ఎంట్రీ సెకండ్ పార్ట్‌లో ఉంటుందని, ఫస్ట్ పార్ట్‌లో మెయిన్ విలన్‌గా సునీల్‌ని చూపించబోతున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే సునీల్ పాన్ ఇండియన్ విలన్‌గా క్రేజ్ తెచ్చుకోవడం ఖాయమనిపిస్తుంది. చూడాలి మరి ఎంత వరకు నిజం ఉందొ ?
Recent Post