తెలుగులో మరో పవర్ ఫుల్ పాత్రలో విజయ్ సేతుపతి

  Written by : Suryaa Desk Updated: Sat, Jul 31, 2021, 02:25 PM

విజయ్ సేతుపతికి .. తమిళనాట ఇప్పుడు ఈ పేరుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒక వైపున స్టార్ హీరోగా .. మరో వైపున స్టార్ విలన్ గా రాణించడం ఆయనకే చెల్లింది. తమిళంలోనే కాకుండా ఇతర భాషల్లోనూ ఇప్పుడు ఆయన బిజీ బిజీ. తెలుగులోను ఈ మధ్య కాలంలో ఆయన బాగా పాప్యులర్ అయ్యారు.


ఈ నేపథ్యంలో ఆయన తెలుగులో ఒక భారీ సినిమా చేయడానికి అంగీకరించినట్టుగా చెబుతున్నారు. సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించనున్న ఈ సినిమాలో, విజయ్ సేతుపతి ఒక కీలకమైన పాత్రను పోషించనున్నాడని అంటున్నారు. బహుశా అది ప్రతినాయకుడి పాత్రనే అయ్యుంటుందనే టాక్ వివినిపిస్తోంది. రాజ్ అండ్ డీకే సమర్పకులుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను, రంజిత్ నిర్మిస్తున్నారు. భరత్ చౌదరి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బలమైన కథాకథనాలు.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమా రూపొందనుందని అంటున్నారు. త్వరలోనే మిగతా వివరాలను వెల్లడించనున్నారు.  
Recent Post