ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బన్నీ “పుష్ప” మూవీ నుంచి అప్డేట్ రానుందా ?

cinema |  Suryaa Desk  | Published : Sun, Aug 01, 2021, 10:07 AM



సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా, రష్మికా  హీరోయిన్‌గా తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”.  ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం పై ఇటీవలే బన్నీ వర్గాల నుంచి కాస్త ఆసక్తికరమైన సూచనలే వస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజా టాక్ ప్రకారం ఈ చిత్రం నుంచి బహుశా ఈ కొద్ది రోజుల్లోనే లేదా రేపు అలా ఒక సాలిడ్ అప్డేట్ రాబోతున్నట్టు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. మరి ఆ అప్డేట్ ఈ సినిమా ఆడియో పైనే ఏమో అన్నది మరింత ఆసక్తికరంగా ముఖ్యంగా ఇటీవలే ఈ సినిమా ఆల్బమ్ కూడా అదిరే రేంజ్ లో వచ్చింది అని తెలిసింది. రేపు దేవిశ్రీ ప్రసాద్ బర్త్ డే కావున మరి మ్యూజికల్ గా ఏదన్నా బ్లాస్టింగ్ అప్డేట్ వస్తుందేమో చూడాలి. ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా తెరకెక్కిస్తుండగా ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com