జబర్దస్త్ కమెడియన్ తమ్ముడితో పెళ్ళికి సిద్ధమైన రష్మీ

  Written by : Suryaa Desk Updated: Sun, Aug 01, 2021, 11:54 AM

హాట్ యాంకర్ కమ్ హీరోయిన్ రష్మీ గౌతమ్ పెళ్లి వార్త ఎవర్ గ్రీన్ టాపిక్ గా ఉంది. సుడిగాలి సుధీర్ ప్రేయసిగా ప్రచారం అవుతున్న రష్మీ.. అతన్ని పెళ్లి చేసుకోవచ్చనే వాదన కూడా ప్రచారంలో ఉంది.  తాజాగా ఓ షో వేదికగా రష్మీ తన పెళ్లి గురించి ఓపెన్ అయ్యింది. ఆయనతో నేను పెళ్ళికి రెడీ అంటూ... షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇక వివరాల్లోకి వెళితే మీరు విస్తు పోవలసిందే. జబర్దస్త్ షోలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కామెడీ పంచే దీవెన అందరికీ తెలిసిందే. రాకింగ్ రాకేష్ టీమ్ లో దీవెన చాలా కాలం పనిచేశారు. అతి తక్కువ ప్రాయంలో జబర్దస్త్ షోకి ఎంట్రీ ఇచ్చిన దీవెన, చక్కని పంచ్ లు డైలాగ్ డెలివరీతో కామెడీ పంచుతారు. ఈ మధ్య రాకింగ్ రాకేష్ టీమ్ లో దీవెనతో పాటు మరికొందరు చైల్డ్ ఆర్టిస్ట్స్ కనిపించడం లేదు.


 ఏడేళ్ల ప్రాయంలో ఉన్న దీవెన లేటెస్ట్ ఎపిసోడ్ కోసం జీవన్ టీమ్ లో కనిపించింది. సర్ప్రైజింగ్ గా తన తమ్ముడిని తీసుకురావడం జరిగింది. స్టేజ్ పైకి రాగానే రోజా ఆశీర్వాదం తీసుకోవాలని తమ్ముడికి చెప్పింది. ఆ బుడ్డోడు రోజాకు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇక నీకు పది ఎపిసోడ్స్ వరకు తిరుగు లేదని దీవెన తమ్ముడికి అభయం ఇచ్చింది. రోజాను పొగిడితే జబర్దస్త్ లో పర్మినెంట్ పోస్ట్ ఖాయం అన్నట్లు సెటైర్ వేసింది. ఆ తరువాత యాంకర్ రష్మీని తమ్ముడికి పరిచయం చేసింది. దీవెన తమ్ముడు నేరుగా యాంకర్ సీట్ లో ఉన్న రష్మీ బుగ్గపై ముద్దు పెట్టాడు. దానికి రష్మీ షాక్ అయ్యారు. అదే సమయంలో దీవెన తమ్ముడిని ఉద్దేశిస్తూ వీడికి పెళ్లి ఈడు వచ్చిందని డైలాగ్ వేశాడు. 


అమ్మో పెళ్లా... అంటూ దీవెన, ఆమె తమ్ముడు షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగా... రష్మీ నేను రెడీ అంటూ గట్టిగా అరిచింది. ఈ సీన్ జబర్దస్త్ వేదికపై నవ్వులు పూయించింది. నాలుగేళ్లు కూడా నిండని దీవెన తమ్ముడిని పెళ్లి చేసుకుంటానని చెప్పి రష్మీ షాక్ ఇచ్చింది. నెక్స్ట్ వీక్ ప్రసారం కానున్న జబర్దస్త్ షో ప్రోమోలో ఈ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇక నిజంగా రష్మీ ఎవరిని పెళ్లి చేసుకుంటుందనే విషయంపై క్లారిటీ లేదు. వరుడు ఎవరైనా కానీ పెళ్లికి మాత్రం ఇంకా సమయం ఉంది అంటుంది ఆమె. సుధీర్ మాత్రం మంచి మిత్రుడు అంటూ పలు సందర్భాలలో చెప్పారు రష్మీ. 
Recent Post