రాజ్ కుంద్రా కేసు: ముంబై పోలీసులు నా నుంచి 15 లక్షల డిమాండ్ చేశారు : నటి గెహానా

  Written by : Suryaa Desk Updated: Sun, Aug 01, 2021, 01:02 PM

రాజ్ కుంద్రా అశ్లీల రాకెట్ కేసు ప్రతీరోజు కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ విషయంలో ప్రమేయం ఉన్న వారు.. సంబంధం ఉన్న వారు బయటకొస్తున్నారు. పలు ఆరోపణలతో ఎక్కువమంది వ్యక్తులు గళమెత్తుతున్నారు.


నెలరోజుల క్రితం అశ్లీల రాకెట్ కేసులో అరెస్ట్ అయిన నటి గెహాన వశిష్ట్ ఇప్పుడు ముంబై పోలీసులపై తాజాగా ఆరోపణలు చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో అశ్లీల వీడియోల రాకెట్ కేసులో గెహానా వశిష్ట్ అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ కాకుండా ఉండేందుకు ముంబై పోలీసులు తన నుంచి 15 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని ఆమె ఆరోపించింది. తాను చట్టవిరుద్ధంగా ఏమీ చేయలేదని వారికి వివరించడానికి ప్రయత్నించానని.. అయితే ఈ కేసును తనపై వేస్తామని బెదిరించినట్లు గెహానా చెప్పుకొచ్చింది.


ఇక ఈ కేసులోనే అరెస్ట్ అయిన నిందితులు యశ్ ఠాకూర్ తన్వీర్ హష్మీ వాట్సాప్ సంభాషణల్లో పోలీసులు వారి నుంచి రూ.8 లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు వాస్తవాలు ఉన్నాయని.. వారు అందుకు సన్నాహాలు చేస్తున్నారని గెహానా సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో గెహానా అరెస్ట్ అయ్యింది.  నాలుగు నెలలు జైలులో కూడా ఆమె ఉన్నారు. రాజ్ కుంద్రా హాట్ షాట్ యాప్ అశ్లీల వీడియోల కేసులో ఆమె పేరు పోలీస్ ఎఫ్ఐఆర్ లో చేర్చబడింది. యాప్ కోసం గెహానా రెండు లేదా మూడు అశ్లీల చిత్రాల్లో నటించారని పోలీసుల నివేదికలో తేలింది. జూలై 19న రాజ్ కుంద్రాను ఈ కేసులో కీలక సూత్రధారిగా అరెస్ట్ చేశారు.
Recent Post