తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 ఫస్ట్ లుక్..ఇంకా క్రేజీ అప్డేట్..?

  Written by : Suryaa Desk Updated: Sun, Aug 01, 2021, 02:31 PM

తెలుగు బిగ్ బాస్ కొత్త సీజన్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత ఏడాది చివర్లో వచ్చిన సీజన్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఏడాది జూన్ లోనే ప్రారంభించాలని భావించినా కూడా కరోనా సెకండ్ వేవ్ వల్ల ఆలస్యం అయ్యింది. థర్డ్ వేవ్ అంటున్నారు కనుక అసలు బిగ్ బాస్ ఉంటుందా లేదా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 5 ఈ ఏడాదిలో ఉంటుందంటూ స్టార్ మా నుండి అధికారిక ప్రకటన వచ్చేసింది. సీజన్ 5 కు సంబంధించిన కొత్త లోగోను ఆవిష్కరించడంతో పాటు కమింగ్ సూట్ అంటూ ప్రోమో విడుదల చేశారు.


స్టార్ మా లో టెలికాస్ట్ కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 5 హోస్ట్ ఎవరు అనే విషయమై ఎప్పటిలాగే ఈసారి కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. గత రెండు సీజన్ లుగా నాగార్జున హోస్టింగ్ చేస్తున్నాడు. ఈ సీజన్ కు కొత్త హోస్ట్ రాబోతున్నాడు అంటూ వస్తున్న వార్తలు అన్ని ఇన్నీ కావు. కాని ఇప్పటి వరకు స్టార్ మా నుండి కాని షో నిర్వాహకుల నుండి కాని ఎలాంటి అప్ డేట్ లేదు. సీజన్ 5 ను అతి త్వరలోనే ప్రారంభించడం ఖాయం అనే విషయమై స్పష్టత వచ్చింది.


సీజన్ 5 హోస్ట్ విషయంలో ఈ నెలలోనే స్పష్టత ఇచ్చి సెప్టెంబర్ నుండి సీజన్ ను మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. గత సీజన్ ను కూడా అటు ఇటుగా అదే సమయంలో మొదలు పెట్టారు. కనుక ఈ సీజన్ విషయంలో కూడా నిర్వాహకులు అదే ఉద్దేశ్యంతో ఉన్నారు అంటూ ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇప్పటికే కంటెస్టెంట్స్ షార్ట్ లిస్ట్ అయ్యిందని.. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుని.. పూర్తి ఆరోగ్యంగ ఉన్న వారికి మొదటి వారం రోజులు క్వారెంటైన్ తర్వాత మాత్రమే షో లోకి ఎంట్రీ ఉంటుందని.. గత సీజన్ మాదిరిగానే ఈ సీజన్ ను కూడా పూర్తిగా కరోనా జాగ్రత్తలు తీసుకుని నిర్వహించబోతున్నారట. అన్నపూర్ణ స్టూడియోలో కొత్త బిబి సెట్ నిర్మాణం జరుగుతుంది.
Recent Post