క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా రకుల్ ప్రీతీ సింగ్ హీరోయిన్ గా ఓ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ అంత పూర్తి చేసుకొని చాల రోజులే అవుతున్న ఈ సినిమా తాలూకా అప్డేట్ రాలేదు. తాజాగా ఓ వార్త మాత్రం సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతుంది.ఈ సినిమాకు అమెజాన్ ప్రైమ్ వారు బంపర్ ఆఫర్ ఇచ్చారట. ఆ ఆఫర్ నిర్మాతలకు కూడా మంచి లాభదాయకంగా అనిపించే విధంగా ఉందట. కాగా ఆ బంపర్ ఆఫర్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చూడాలి మరి ఇందులో ఎంత నిజం ఉందొ...?