నువ్వు నన్ను ఎప్పటికీ మన్నించలేవని నాకు తెలుసు : యాషిక ఆనంద్ భావోద్వేగమైన పోస్ట్

  Written by : Suryaa Desk Updated: Tue, Aug 03, 2021, 03:16 PM

తమిళ నటి యాషిక ఆనంద్ యాక్సిడెంట్ కి గురయ్యి ఆసుపత్రి పాలు అయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో యాషిక కి తీవ్ర గాయాలవడంతో ఆమెని ఆసుపత్రికి తరలించారు. సర్జరీ తదనంతరం 'నోటా' భామ యాషిక ను ఐసీయూ నుండి నార్మల్ వార్డ్ కి తరలించారు . యాషిక పుద్దుచేరి నుంచి చెన్నై వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో తన స్నేహితురాలు భవాని ప్రాణాలు కోల్పోయింది.


గాయాల నుండి క్రమంగా కోలుకుంటున్న యాషిక సోషల్ మీడియా ద్వారా తన పరిస్థితిని వివరించింది. తన పరిస్థితిని మాటల్లో వివరించలేనని తను బ్రతికి ఉన్నందుకు అపరాధ భావంతో ఉన్నటు తెలిపింది. ఈ ప్రమాదం నుండి కాపాడినందుకు ఆ భగవంతుడికి కృతఙ్ఞతలు తెలపాలో స్నేహితురాలిని తీసుకెళ్ళినందుకు దేవుడిని నిందించాలో అర్థం కావట్లేదంటూ భావోద్వేగంగా చెప్పింది.


"జీవితంలో ప్రతి క్షణం నిన్ను మిస్ అవుతున్నా పావని. నువ్వు నన్ను ఎప్పటికీ మన్నించలేవని నాకు తెలుసు. నీ కుటుంబాన్ని ఇలాంటి పరిస్థితుల్లో ఉంచినందుకు నన్ను క్షమించు. నిన్ను ప్రతి క్షణం మిస్ అవుతున్నానని బ్రతికి ఉన్నందుకు ఇంకా అపరాధ భావంతోనే ఉన్నానని తెలుసుకో. నీ ఆత్మకి శాంతి చేకూరాలని ఆశిస్తున్నాను. ఎప్పటికైనా మీ కుటుంబం నన్ను క్షమిస్తుందనే అనుకుంటున్నాను. నీతో గడిపిన క్షణాలు ఎప్పటికీ  గుర్తించుకుంటాను" యాషిక ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. తను పుట్టినరోజుకి కూడా దూరంగా ఉంటున్నట్టు తన పుట్టినరోజుని జరుపుకోవద్దని తన అభిమానులకి కూడా విజ్ఞప్తి చేసింది. స్నేహితురాలిని కోల్పోవడం తన జీవితాల్లో పెద్ద లోటని భవాని కుటుంబం కోసం ప్రార్ధించాలని తన ఫాలోవర్స్ కి తెలిపింది.
Recent Post