ఇప్పుడెలా ఉన్నానో చెప్పండి’ అంటూ... నగ్న వీడియోను పోస్ట్ చేసిన బాలీవుడ్ నటి

  Written by : Suryaa Desk Updated: Tue, Aug 03, 2021, 03:40 PM

రాజ్ కుంద్రా అశ్లీల వీడియోల  రాకెట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి గెహనా విశిష్ట్ మరోసారి వార్తల్లోకెక్కింది. తాజాగా ఒంటిపై నూలుపోగు లేకుండా లైవ్ లోకి వచ్చి అభిమానులకు షాకిచ్చింది. అయితే దీని వెనుకాల ఆమె నిరసన.. ఆవేదన ఉంది. రాజ్ కుంద్రా కేసులో ప్రధాన ఆరోపణ అశ్లీల వీడియోలు తీశారని.. అయితే అశ్లీలానికి అసభ్యతను శృంగార సీన్లకు తేడాను చూపించడానికే ఈ బాలీవుడ్ నటి నగ్నంగా బయటకు వచ్చింది. కేవలం బట్టలు లేకుండా ఉండటం వల్ల అందంగా లేదా అసభ్యంగా ఉందో తెలుసుకోవాలనుకుందట.. ఇక లైవ్ లో గెహానా మాట్లాడుతూ.. ‘బట్టలు లేకుండా నగ్నంగా ఉన్నాను.. ఇప్పుడెలా ఉన్నానో చెప్పండి’ అంటూ గెహానా ఇన్ స్టాగ్రామ్ నగ్న వీడియోను పోస్ట్ చేసి సంచలనం సృష్టించింది. ‘నగ్నంగా ఉన్న నేను అందంగా ఉన్నానా? అసభ్యంగా అనిపిస్తోందా? అశ్లీలంగా ఉందా?’ అంటూ ఫ్యాన్స్ ను ఏమోషనల్ గా అడిగింది. ఇక ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయ్యింది.


‘బట్టలు లేకుండా లైవ్ లోకి వచ్చాను. కానీ ఏ ఒఖ్కరూ ఇది అశ్లీలం అని చెప్పడం లేదు. పైగా నేను బట్టలు వేసుకున్న సందర్భాల్లోనే కొందరు దాన్ని అశ్లీలం అంటున్నారు. మరీ ఇంత కపటధారుల్లాగా ప్రవర్తించడానికి కూడా ఓ హద్దు ఉంటుంది’ అని క్యాప్షన్ ఇచ్చి నగ్న వీడియోను గెహానా పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


నెలరోజుల క్రితం అశ్లీల రాకెట్ కేసులో అరెస్ట్ అయిన నటి గెహాన వశిష్ట్ ఇప్పుడు ముంబై పోలీసులపై తాజాగా ఆరోపణలు చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో అశ్లీల వీడియోల రాకెట్ కేసులో గెహానా వశిష్ట్ అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ కాకుండా ఉండేందుకు ముంబై పోలీసులు తన నుంచి 15 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని ఆమె ఆరోపించింది. తాను చట్టవిరుద్ధంగా ఏమీ చేయలేదని వారికి వివరించడానికి ప్రయత్నించానని.. అయితే ఈ కేసును తనపై వేస్తామని బెదిరించినట్లు గెహానా చెప్పుకొచ్చింది. ఇక ఈ కేసులోనే అరెస్ట్ అయిన నిందితులు యశ్ ఠాకూర్ తన్వీర్ హష్మీ వాట్సాప్ సంభాషణల్లో పోలీసులు వారి నుంచి రూ.8 లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు వాస్తవాలు ఉన్నాయని.. వారు అందుకు సన్నాహాలు చేస్తున్నారని గెహానా సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో గెహానా అరెస్ట్ అయ్యింది.  నాలుగు నెలలు జైలులో కూడా ఆమె ఉన్నారు. రాజ్ కుంద్రా హాట్ షాట్ యాప్ అశ్లీల వీడియోల కేసులో ఆమె పేరు పోలీస్ ఎఫ్ఐఆర్ లో చేర్చబడింది. యాప్ కోసం గెహానా రెండు లేదా మూడు అశ్లీల చిత్రాల్లో నటించారని పోలీసుల నివేదికలో తేలింది. 
Recent Post