అల్లు అర్హ కు గ్రాండ్ గా స్వాగతం పలికిన 'శాకుంతలం' టీమ్..!

  Written by : Suryaa Desk Updated: Tue, Aug 03, 2021, 04:32 PM

క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న పౌరాణిక ప్రేమగాధ ''శాకుంతలం''. ఇందులో సమంత అక్కినేని - మలయాళ హీరో దేవ్ మోహన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మహాభారత గాథ ఆదిపర్వంలోని శకుంతల - దుష్యంతుడి ప్రేమ కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ తెరంగ్రేటం చేస్తోంది.


'శాకుంతలం' చిత్రంలో ప్రిన్స్ భరత పాత్రలో అల్లు అర్హ కనిపించనుంది.  ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న ఈ సినిమా షెడ్యూల్ లో అల్లు వారి గారాల పట్టి కూడా జాయిన్ అయింది. తాజాగా అల్లు అర్హ కు మేకప్ వేస్తున్న ఓ వీడియోని బయటకు వదిలారు. అలానే గుణశేఖర్ కుమార్తె మరియు నీలిమ గుణ కూడా ట్విట్టర్ లో 'లిటిల్ స్టార్ అల్లు అర్హ కోసం సిద్ధంగా ఉంది' అంటూ కార్వాన్ కు సంబంధించిన ఓ ఫోటోని షేర్ చేశారు.


అల్లు అర్హా ను తన ఫస్ట్ డే షూట్ కోసం గ్రాండ్ గా స్వాగతం పలకడానికి చిత్ర బృందం కార్వాన్ ను అందంగా అలంకరించారు. కార్వాన్ డోర్ వద్ద 'ARHA' లెటర్ బెలూన్ లతో లిటిల్ స్టార్ కు ఘనంగా స్వాగతం పలికినట్లు తెలుస్తోంది. ఇకపోతే అల్లు అర్హ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీతో అల్లు ఫ్యామిలీ నాల్గవ తరం కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టినట్లు అయింది. తన క్యూట్ నెస్ తో ముద్దు ముద్ద మాటలతో ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్న అర్హ.. 'శాకుంతలం' సినిమా ద్వారా అరంగేట్రం చేస్తుండటం గర్వకారణమని అల్లు అర్జున్ ఇది వరకే పేర్కొన్నారు. కాగా 'శాకుంతలం' చిత్రంలో శకుంతలగా సమంత.. దుష్యంతుడిగా దేవ్ మోహన్ కనిపించనున్నారు. వీరి తనయుడు భరత పాత్రలోనే అర్హ నటిస్తోంది. సంగీత బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. శేఖర్ వి జోసెఫ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో డీఆర్పీ - గుణా టీమ్ వర్క్స్ పతాకంపై నీలిమ గుణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
Recent Post