ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దిగు దిగు నాగ అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 04, 2021, 09:17 AM



ఊహలు గుసగుసలాడే సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు నాగశౌర్య. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలను చేసుకుంటూ తనకంటూ ఓ ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రస్తుతం నాగశౌర్య చేతిలో 6 వరకు సినిమాలు ఉన్నాయి. అందులో లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న వరుడు కావలెను చిత్రం ఒకటి. ఈ సినిమాలో నాగశౌర్య సరసన రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాను వీలైనంత తొందరగా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్.


కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన దిగు దిగు నాగ అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు చిత్ర యూనిట్. రేపు ఉదయం 10 గంటలకు ఈ పాట విడుదల కానుంది. అనంత శ్రీరామ్ లిరిక్స్ రాయగా. శ్రేయ ఘోషల్ పాడారు. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com