ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి నుంచే ఓటిటీ లో స్ట్రీమింగ్.. నయనతార క్రైమ్ థ్రిల్లర్ 'నెట్రికన్'

cinema |  Suryaa Desk  | Published : Fri, Aug 13, 2021, 02:05 PM



లేడి సూపర్ స్టార్ నయనతార నటిస్తున్న తాజా చిత్రం నెట్రికన్. కరోనా నేపథ్యంలో ఈ సినిమా హాట్ స్టార్‌లో డైరెక్ట్ రిలీజ్ అయ్యింది. ఆగస్టు 13న అంటే ఈరోజు నుంచి నెట్రికన్ అందుబాటులోకి వచ్చింది. నెట్రికన్‌లో నయనతార అంధురాలిగా కనిపించినుంది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా నెటిజన్స్‌ను బాగానే ఆకర్షిస్తోంది. నెట్రికన్ సినిమాను విఘ్నేష్ శివన్ నిర్మించగా.. మిలింద్ రావ్ దర్శకత్వం వహించారు. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాగా వచ్చిన నెట్రికన్ బ్లైండ్ అనే కొరియన్ సినిమాకు రీమేక్. ఇక నయనతార గతంలో కూడా ఇలాంటీ లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. తమిళ్‌లో 'అరం', 'డోరా', 'కోలమావు కోకిల', 'ఐరా', 'కొలైయుదిర్‌కాలం'... వంటి హీరోయిన్ ఓరియెంటెడ్  సినిమాల్లో నటించి అదరగొట్టింది నయనతార. ఇక నెట్రికన్ విషయానికి వస్తే.. ఇది నయనతార నటిస్తున్న 65వ సినిమా. కంటి చూపు లేని యువతి తన వినికిడి శక్తిని ఉపయోగించి సీరియల్ కిల్లర్ ను ఎలా పట్టుకుంది అనేదే కథ.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com