ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సినిమాలో 1600 మంది కానీ.. నిజ జీవితంలో ఎంత మందికి ప్రపోజ్ చేశాడో తెలుసా?.. విశ్వక్ సేన్

cinema |  Suryaa Desk  | Published : Fri, Aug 13, 2021, 02:32 PM



రేపు విడుదల కానుంది విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ‘పాగల్’. తాను ఎంచుకునే మూవీలు కాస్త భిన్నంగా ప్లాన్ చేసుకునే యువ హీరోల్లో అతగాడు ఒకడు. అతడి మాటలు మిగిలిన హీరోలకు భిన్నంగా ఉంటాయి. విశ్వక్ ను. మాటల్ని మొదటిసారి విన్నంతనే అంతగా ఎక్కదని.. కానీ రెండు.. మూడుసార్లు అతనితో మాట్లాడినప్పుడు మాత్రం అతడిలోని నిజాయితీ కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని చెబుతారు. పాగల్ సినిమాలో 1600 మందికి ప్రపోజ్ చేసినట్లుగా చూపించే సీన్ కు ఇప్పటికే ఆదరణ రావటమే కాదు.. సినిమా మీద ఆసక్తిని భారీగా పెంచేసింది. సినిమా మొదలు పెట్టి చాలా కాలమే అయినా.. ట్రైలర్ విడుదలైన తర్వాత వచ్చిన బజ్ చిత్ర యూనిట్ కు కొత్త ఉత్సాహాన్ని కలిగించేలా చేసిందని చెప్పాలి. సినిమా విడుదలకు మూడు.. నాలుగు రోజుల ముందు నుంచి పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాల్ని నడిపిస్తున్న విశ్వక్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అతగాడి మాటలు ఆసక్తికరంగా మారాయి.


పాగల్ మూవీలో 1600 మంది అమ్మాయిలకు ప్రపోజ్ చేశారు కదా.. రియల్ లైఫ్ లో ఎంతమందికి ప్రపోజ్ చేశారన్న ప్రశ్నకు.. ఊహించని విధంగా సూటిగా సమాధానం చెప్పేయటం విశేషం. తాను నలుగురికి ప్రపోజ్ చేశానని.. ఒకరు ఓకే చేశారని చెప్పారు. సినిమా గురించి చెబుతూ.. పాగల్ సినిమాలో చాలామందికి తెలీని విషయం.. ఈ సినిమా కడుపుబ్బా నవ్విస్తుందని.. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే సినిమా అని చెప్పాడు. రెండున్నర గంటల పాటు సినిమాను థియేటర్లో చూసిన తర్వాత.. అప్పుడే అయిపోయిందా? అన్న భావనను కలుగజేస్తుందని చెప్పాడు. విశ్వక్ మాటల్ని విన్నంతనే.. సినిమాను వెంటనే చూసేయాలన్న భావన కలగటం ఖాయం. మరి.. అతడి మాటల్లో వాస్తవం లెక్క తేలాలంటే శనివారం వరకు ఆగాల్సిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com