25 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకున్న “వలిమై ఫస్ట్ సింగిల్”...!

  Written by : Suryaa Desk Updated: Wed, Sep 15, 2021, 02:06 PM

హెచ్ వినోథ్ దర్శకత్వం లో  అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం వలిమై. ఈ చిత్రం లో హుమ ఖురేషీ, కార్తికేయ, బని, సుమిత్ర, అచ్యుత్ కుమార్, యోగి బాబు, రాజ్ అయ్యప్ప, పుగజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రం కి సంబంధించిన ఫస్ట్ సింగిల్ విడుదల అయిన సంగతి అందరికీ తెలిసిందే. నాంగా వీర మారి పేరిట విడుదల అయిన లిరికల్ వీడియో సోషల్ మీడియా లో మాత్రమే కాకుండా, యూ ట్యూబ్ లో సైతం సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ఈ పాట 25 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. అంతేకాక 1.3 మిలియన్ లైక్స్ ను సొంతం చేసుకుంది. అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.  ఈ చిత్రం ను బోని కపూర్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 
Recent Post