'విశాఖ వాణి' గా రమ్యకృష్ణ

  Written by : Suryaa Desk Updated: Wed, Sep 15, 2021, 03:32 PM

ప్రముఖ నటి రమ్యకృష్ణ అప్పట్లో హీరోయిన్ గా, ఇప్పుడు మంచి నటిగా త‌ను పోషించే పాత్ర‌లకు వంద శాతం న్యాయం చేస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ క్ష‌ణం తీర‌క లేకుండా సినిమాలు చేస్తోంది. ప్ర‌స్తుతం తన భర్త కృష్ణ వంశీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రంగ మార్తండలో నటిస్తోంది. ఈ సినిమా నట సామ్రాట్ అనే ఓ మరాఠి సినిమాకు రీమేక్‌ గా రూపొందుతోంది. ఇక సాయి ధరమ్ తేజ్ హీరోగా న‌టించిన రిప‌బ్లిక్ సినిమాలో కూడా రమ్యకృష్ణ కీల‌క పాత్ర పోషించింది. ఇందులో విశాఖ వాణి అనే పాత్ర‌లో కనిపించనుంది. ఈ రోజు ర‌మ్య‌కృష్ణ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆ సినిమా నుండి రమ్యకృష్ణ లుక్ ను విడుద‌ల చేశారు. సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవ్ కట్టా డైరెక్షన్ లో తెరకెక్కిన “రిపబ్లిక్” సినిమా అక్టోబర్ 1న గాంధీ జయంతి సంద‌ర్భంగా విడుదల కానుంది. ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Recent Post