షణ్ముఖ్ ఫ్యాన్స్ నుంచి సరయుకు బెదిరింపు కాల్స్!

  Written by : Suryaa Desk Updated: Wed, Sep 15, 2021, 04:20 PM

బిగ్‏బాస్ రియాల్టీ షోలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ముఖ్యంగా ఎలిమేషన్ ప్రక్రియ.. ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారమే కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతారని చెబుతుంటారు నిర్వహకులు. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనుకున్నవారు.. అనుహ్యంగా ఎలిమినేట్ అయ్యి ఇంటి ముఖం పడుతుంటారు. ఎప్పటిలాగే ఈసారి సీజన్ 5లో కూడా స్ట్రాంగ్ అనుకున్న సరయూ అనుహ్యంగా ఎలిమినేట్ అయ్యింది. సరయూ ఎలిమినేషన్‏తో ఆమె అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. బిగ్ బాస్‏ని దమ్ దమ్ చేస్తానని ఇంట్లోకి వెళ్లిన సరయు మొదటి వారంలోని ఎలిమినేట్ అయ్యింది. అయితే సరయు ఎలిమినేషన్ విషయంలో మాత్రం అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. ఓటింగ్ ప్రకారమే సరయు ఎలిమినేట్ అయ్యిందా లేక కావాలనే తప్పించారా అనే దానిపై నెట్టింట్లో ఇప్పటికీ చర్చ జరుగుతుంది. ఎలిమినేట్ తర్వాత ఎక్కడా ఇంటర్వ్యూస్ ఇవ్వని సరయు తాజాగా తన 7 ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే సరయు ఎలిమినేట్ అయిన తర్వాత నాగ్ ఎదురుగానే ఒక్కొక్కరికి ఇచ్చిపడేసింది. ఫేక్ ఆడుతున్నారని, ముఖ్యంగా షణ్ముఖ్, సిరి కలిసి ఆడుతున్నారని, ముందుగానే మాట్లాడుకుని వచ్చారని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ బజ్‏లోనూ షణ్ముఖ్ పై సరయు తీవ్ర ఆరోపణలు చేసింది. షణ్ముఖ్‏కి దమ్ముంటే మగాడిలా ఆడాలని, లేదంటే గాజులేసుకుని కూర్చోవాలని తెలిపింది. అలాగే సిరి మగాళ్లను అడ్డుపెట్టుకుని గేమ్ ఆడుతుందంటూ తెలిపింది. ఇక సరయు ఎలిమినేట్ తర్వాత షన్నూ ఫ్యాన్స్ ఆమెకు వ్యతిరేకంగా అసభ్య పదాజాలంతో దూషిస్తూ కామెంట్స్ చేస్తున్నారని దారుణంగా తిడుతున్నారని చెప్పుకొచ్చింది సరయు. ఇంట్లో జరిగిన అన్ని విషయాలను టెలికాస్ట్ చేయలేదని, అక్కడ జరిగిన అన్ని గొడవలకు సంబంధించిన పూర్తి ఆధారాలు తన దగ్గర ఉన్నాయని తెలిపింది. అంతేకాకుండా ఫోన్స్ చేసి మరీ తనను తిడుతున్నారని వీడియోలో చెప్పుకొచ్చింది సరయు.
Recent Post